TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్లు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ.. పట్టించుకోకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసిన టీజీపీఎస్సీ (TGPSC) మరికాసేపట్లో హాల్‌టికెట్లను విడుదల చేయనుంది.
హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ.. పట్టించుకోకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసిన టీజీపీఎస్సీ (TGPSC) మరికాసేపట్లో హాల్‌టికెట్లను విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ (హెచ్ఎండీఏతో సహా) పరిధిలో పరీక్షలు జరగనున్నాయి.
563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.
గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు..
కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పునివ్వనుంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలపడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై వేసిన కేసులపై కూడా తీర్పు రానున్నది. ఈ నెల 16న రిజర్వేషన్లపై వేసిన మరో మూడు కేసులు సైతం హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

