హైదరాబాద్ : వరంగల్ జిల్లా గీసుకొండ(Geesukonda) మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ విషయంలో వివాదం చోటు చేసుకుంది. కాగా, ధర్మారం వద్ద హెడ్ కానిస్టేబుల్ భిక్షపతిపై రాత్రి కొందరు యువకుల దాడికి(Attack on head constable) పాల్పడ్డారు. మామునూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నహెడ్ కానిస్టేబుల్ భిక్షపతి విధి నిర్వహణలో భాగంగా తనపై దాడి జరిగినట్లు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. కాగా, నిన్నటి వివాదంపై మంత్రి కొండా, రేవూరి స్పందించారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిన్న చిన్న గొడవలు ఏ పార్టీలోనైనా ఉండటం సహజమేనన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.