హైదరాబాద్: విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) నివాళులర్పించారు. మౌలాలిలోని ఆయన నివాసానికి చేరుకున్న హరీశ్‌రావు.. సాయిబాబా పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాయిబాబా మృతి బాధాకరమని చెప్పారు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి నిర్ధోషిగా బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలా జరగడం శోచనీయమన్నారు. దశాబ్ద కాలంపాటు ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అని తెలిపారు. ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరమన్నారు. హరీశ్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్ నాయక్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. సాయిబాబా భౌతిక కాయానికి నివాళులర్పించారు.
విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా గారి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు https://t.co/4i8VZc5xi9 pic.twitter.com/Ptr2g3cCvQ
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
అంతకుముందు గన్‌పార్క్ వద్ద స్వత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సాయిబాబా భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అమర వీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆయన పార్థివదేహాన్ని అమరుల స్థూపం వద్ద పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పౌరహక్కుల నేతలు, ఆయన స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అబులెన్స్లోనే ఆయన మృతదేహాన్ని మౌలాలికి తరలించారు.
గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత!
ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులు.. అంబులెన్స్ లోనే ఉండిపోయిన పార్థివదేహం.
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న సాయిబాబా అభిమానులు, పౌరహక్కుల నేతలు. pic.twitter.com/3jbHgBrM5Z
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024