హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న నిర్వహించిన అలయ్ బలయ్(Alai Balai) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించారు. రచయిత, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్(Madabhushi Sridhar), సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్లాం.. రేవంత్ రెడ్డి వస్తున్నాడని అతని సెక్యూరిటీ నా గొంతు నొక్కి తోసేశారు, నా మిత్రుడు యాదగిరి కాలి పైన తొక్కితే నెత్తురు వచ్చిందని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతి వాడిని చంపేయాలా? అని ప్రశ్నించారు. అదృష్టవశాత్తు చావు తప్పి, బయటపడ్డాం. సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానేయండి..సామాన్యుల్ని చంపకండి బండారు దత్తాత్రేయ గారూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం
రచయిత, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్.. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై దాడి చేసిన రేవంత్ రెడ్డి సెక్యూరిటీ.
గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్లాం.. రేవంత్ రెడ్డి వస్తున్నాడని అతని సెక్యూరిటీ నా… pic.twitter.com/Vfk2N8Y9Bh
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024