Harish Rao | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.. నువ్వు పూర్తిగా విఫలం అయిపోయావు అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే నువ్వు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌రావు సందర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ మాటలు కోటలు దాటుతాయి.. చేతల్లో మాత్రం శూన్యం. విద్యాశాఖ, సోషల్ వెల్ఫేర్ సీఎం దగ్గరే ఉన్నాయి. కానీ హాస్టల్ విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ ఛార్జిలు అందడం లేదు. మెస్ బిల్లులు విడుదల చేయడం లేదు. పిల్లలకు పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారు. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యూ ఆర్ ఏ ఫెయిట్యూర్ చీఫ్ మినిస్టర్. యూ ఆర్ ఫెయిల్ టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్సియల్స్ స్కూల్స్.. నీవు పూర్తిగా విఫలం అయ్యావు. మాటలు కాదు.. యాక్షన్‌లో చేసి చూపించు. పిల్లల గురించి ఆలోచించు అని హరీశ్‌రావు సూచించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా గుంజుకుందాం.. ప్రతిపక్షాల గొంతు ఎలా నొక్కుదాం.. ఎలా ఇబ్బంది పెడుదామని ఆలోచిస్తున్నావు.. పాలన వదిలిపెట్టావు. నేల విడిచి సాము చేస్తున్నవ్. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు. చక్కగా చదువు చెప్పే పని చేయ్. ఆ పని చేత కాదు. మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ పిల్లలను చూసి సోయి తెచ్చుకుని గురుకులాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | విద్యార్థులు లేరంటూ 1,864 స్కూళ్లను మూసేసే కుట్ర.. మండిపడ్డ కేటీఆర్
Jurala Project | జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద.. 45 గేట్లు ఎత్తివేత