KTR | విద్యార్థులు లేరంటూ 1,864 స్కూళ్లను మూసేసే కుట్ర.. మండిపడ్డ కేటీఆర్
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు గా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు గా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావిస్తుండటం సిగ్గుచేటన్నారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గింది. ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.
25 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి..
ప్రధానంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య లేకపోవటంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపుగా 25 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయటం, టీచర్లను డిప్యూటేషన్ మీద ఇతర స్కూళ్లకు పంపించటంతో చాలా చోట్ల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు సరైన మౌలిక వసతులు లేకపోవటం, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవటం, స్కూళ్లలో, సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటేనే తల్లితండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు.
నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత
గత కొన్ని రోజులుగా గురుకుల స్కూళ్లలో జరుగుతున్న సంఘటనలు, వసతి గృహాల్లో విషాహారం, భద్రత లేని పరిస్థితులు, విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని కేటీఆర్ అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ కుంటి సాకులు వెతుక్కుంటుందని కేటీఆర్ విమర్శించారు.
మౌలిక వసతుల కల్పనకు రూ. 7,289 కోట్ఉల కేటాయించాం..
కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా భోదన చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంతే కాకుండా మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందిచేందుకు దాదాపు రూ. 7,289 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ ద్వారా కూడా పాఠశాలకు పక్కా బిల్డింగ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు వ్యవస్థగతంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. స్కూళ్లలో డ్రాఫౌట్స్ను నివారించేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా తెచ్చామన్నారు. ఫలితంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు.
పేద విద్యార్థులు చదువుకోవడం రేవంత్‌కు ఇష్టం లేనట్టుంది..
కేసీఆర్ వేసిన బాటను మరింత పటిష్టం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సోయి లేకుండా ప్రవర్తిస్తోందన్నారు. స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గి పోవటానికి కారణాలను అన్వేషించి వాటి నివారణపై దృష్టి పెట్టకుండా స్కూళ్లను మూసివేయటమేమిటనీ ప్రశ్నించారు. అంటే పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కోవటం రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను సృష్టించి తద్వారా విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయాలని భావిస్తున్నారా అని కేటీఆర్ నిలదీశారు. అత్యంత ప్రాధాన్యమైన ఈ అంశాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
విద్యా శాఖకు మంత్రిని కేటాయించాలి..
అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ సీఎంకు రాజకీయాలు, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప ప్రజల సమస్యలపై సోయి ఉందా అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి కారణాలు, ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కూడిన కమిటీ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
విద్యారంగ సమస్యలపై ఆందోళనలు చేపడుతాం..
ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రభుత్వం అందించే విద్య పైనే ఆధారపడిన నిరుపేద లక్షలాది విద్యార్థుల తల్లితండ్రులకు అన్యాయం చేస్తామంటే వారే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

