Harish Rao | రిటైర్డ్ ఇంజినీర్లు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి గేట్లు ఎత్తొచ్చని చెప్తే.. ఆ నీళ్లు ఎత్తొచ్చని చెప్పిన ఇంజినీర్లను జైళ్లలో పెడతమని, బెల్ట్‌తో కొడ్తమని రాజకీయాలు చేస్తున్నది మీరని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రైతులకు నీరందంచండి..కరెంట్ ఇవ్వండి..విద్యుత్ సామర్థ్యం ఉన్నది.. విద్యుత్ ప్లాంట్లు ఉన్నయి. బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముల్లు కట్టె పెట్టి నిద్రలేపుతున్నాం. మీకు విషయాలు చెబుతున్నమన్నారు.
రాజకీయాలు చేయడం మీరు మానండి.. విద్యుత్ ఉత్పత్తి పెంచండి.. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండని ప్రభుత్వానికి హరీశ్ రావు సూచించారు.. రైతులకు కరెంట్ ఇవ్వకపోగా ఇప్పుడు భూములపై ట్యాక్స్ చేస్తారట. కమీషన్ల కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీని నిలిపేశారు. నాణ్యమైన బొగ్గును వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. దేవాదులకు నీళ్లు అందడానికి కారణం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోతలు-వాతలు తప్ప ఏమీ లేవన్నారు.
రైతులకు కరెంట్ ఇవ్వకపోగా ఇప్పుడు భూములపై ట్యాక్స్ వేస్తారట. రైతులకు నీళ్లు ఇవ్వమంటే రక్తం పారిస్తామంటున్నారు. రెండు పంటలకు బోనస్ ఎగ్గొట్టారు. విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. విద్యుత్ సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి చేయలేకపోతున్నారు. 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 3100 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33 శాతం మాత్రమే. ఎల్‌నినో వస్తుందని తెలిసినా ముందస్తు ప్రణాళిక లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పారిశ్రామిక వేత్తలు, ప్రజలపై భారం పడుతోందన్నారు.
Live: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశంhttps://t.co/ADDPWcGjwt
— BRS Party (@BRSparty) July 16, 2026