రాజన్న సిరిసిల్ల : రేషన్ డీలర్ల(Ration dealers) నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల(Sircisilla) పట్టణంలోని వాటర్ ట్యాంక్(Water tank) ఎక్కి పెట్రోల్ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తే ఉన్న పళంగా రద్దు చేసి మా కుటుంబాలు రోడ్డున పడేశారని అవేదన వ్యక్తం చేశారు.
పాత వారికే రేషన్ డీలర్ షిప్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!