Rapido Driver | తెలంగాణలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ముందుకోస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్కు చెందిన సాయి అనే ర్యాపిడో డ్రైవర్ వరద బాధితులకు సాయం చేసినట్లు ప్రకటించారు. తను రోజంతా ర్యాపిడో నడిపి రూ.780 సంపాదించి.. ఆ డబ్బును వరద బాధితులకు సాయం చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
నా పేరు సాయి. హైదరాబాద్లోని చంపపేట్లో నివసిస్తాను. నేను ఒక ర్యాపిడో డ్రైవర్. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా రాపిడో బైక్ నడిపి రూ.780 సంపాదించడం జరిగింది. ఈ డబ్బును వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ కి పంపడం జరిగింది. నా వంతు సాయంగా నేను చంపాపేట్ డివిజన్ ప్రజలందరి తరపున ఈ చిన్నపాటి సాయం చేశాను అంటూ సాయి రాసుకోచ్చాడు. దీనికి తెలంగాణ సీఎంఓ ఖాతాతో పాటు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఖాతను ట్యాగ్ చేశాడు. ఇక సాయి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖులందరూ దానం చేసిన దానికంటే నువ్వు డోనేట్ చేసింది చాలా గొప్పది అంటూ రాసుకోస్తున్నారు.
నా పేరు సాయి చంపాపేట్ నేను హైదరాబాద్లో రాపిడో బైక్ నడుపుతాను ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా రాపిడో బైక్ నడిపి 780రూపాయలు సంపాదించడం జరిగింది ఈరోజు నేను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ కి పంపడం జరిగింది నా వంతు సాయంగా నేను చంపాపేట్ డివిజన్ ప్రజలందరి తరఫున @TelanganaCMO @KTRBRS pic.twitter.com/BHcEtVJpxt
— Sai Champapet official (@SaiChampapet2) September 5, 2024
Also Read..