హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు(Heavy rains) పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఖమ్మం(Khammam ) జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Ministers )పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే(Aerial Survey) ద్వారా పరిశీలించారు. వరదలకు కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి కేంద్ర మంత్రులు పాలేరు వెళ్లి వరద పరిస్థితులపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు.