గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:44:19

హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం

హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆక‌స్మికంగా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారాయి. ఉన్నట్టుండి గురువారం మ‌ధ్యాహ్నం న‌గ‌రంలోని ప‌లు చోట్ల వ‌ర్షం కురిసింది. దీంతో గ‌త కొద్ది రోజుల నుంచి ఉక్క‌పోత‌కు గుర‌వుతున్న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. గ‌త కొద్ది రోజుల నుంచి ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతున్న విష‌యం తెలిసిందే. 

ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండ‌పూర్, మోహిదీప‌ట్నం, ల‌క్డికాపూల్, అసెంబ్లీ, అబిడ్స్, కోఠి, మ‌ల‌క్ పేట్, దిల్‌సుఖ్ న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్, హ‌య‌త్ న‌గ‌ర్, సంతోష్ న‌గ‌ర్, చంపాపేట్, అంబ‌ర్‌పేట‌, రాంన‌గ‌ర్‌, తార్నాక‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, బేగంపేట‌, తార్నాక‌, బోయిన్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, అమీర్‌పేట లో వ‌ర్షం కురిసింది. 


logo