Medical College | మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను, సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్‌కు చెందిన 10 మందిని సస్పెండ్ చేసిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఎదిర సమీపంలో ఉన్న వైద్య కళాశాల క్యాంపస్‌లో చదువుతున్న 2022 – 2023 బ్యాచ్‌కు చెందిన రెండో సంవత్సరానికి చెందిన వారు 2023 – 2024 ఫ్రెషర్స్‌ను వారం వారంరోజుల కిందట రాత్రి సమయంలో ర్యాగింగ్ చేసినట్లు సమాచారం.
ర్యాగింగ్‌తో కొత్తగా చేరిన విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కళాశాల డైరెక్టర్ ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వివరాలు సేకరించి ర్యాంగింగ్కు కారణమైన 10 మందిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థిలను సస్పెండ్ చేశామని, డిసెంబర్ ఒకటో తేదీ వరకు తరగతులకు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ర్యాగింగ్ పునరావృతం కాకుండా కఠినంగా హెచ్చరించాం.. కమిటీ వేసి రాత్రి సమయంలో నిఘా పెంచినట్లు డైరెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-4 ఫలితాలు విడుదల
Osmania University | డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
Patnam Narender Reddy | పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు : పట్నం నరేందర్ రెడ్డి