TGPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 తుది ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా 8,180 పోస్టులకు గానూ 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం గురువారం సాయంత్రం ఫలితాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | ఆర్మీ జవాన్ ఆత్మహత్య.. నాగర్కర్నూల్ జిల్లాలో ఘటన
KTR | లగచర్ల ప్రజల తరపున న్యాయ పోరాటం చేస్తాం : కేటీఆర్