ప్రజాసమస్యల పరిష్కార దేవాలయాలు క్యాంప్ ఆఫీసులు : మంత్రి వేముల
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు

నిజామాబాద్ : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులతో నియోజకవర్గ సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు క్యాంప్ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనతో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయిస్తున్నారని మంత్రి వేముల వివరించారు.
నియోజకవర్గంలోని ప్రజలంతా ఎమ్మెల్యేలకు బిడ్డల్లాంటి వారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా క్యాంపు కార్యాలయం పరిష్కార కేంద్రంగా ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారులకు, ప్రజలకు అనుకూలంగా వుండే విధంగా ఎమ్మెల్యే అక్కడే బస చేసి అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని రూ. కోటి 90 లక్షలతో నిర్మాణం చేయనున్నట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

