బాలీవుడ్ స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు.ఆయనకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ వివాదాలతోను వార్తలలో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు కాగా, ఇప్పటికీ ఆ కేసు విషయంలో పోరాడుతూనే ఉన్నాడు.
అయితే గేమ్ డెవలపర్స్ నిర్వాహకులు సల్మాన్ .. హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి పేరడిగా ఓ వీడియో గేమ్‌ని రూపొందించారు. ‘సెల్మన్ భాయ్’ పేరుతో రూపొందిన ఈ వీడియో గేమ్ ద్వారా తనను అవమానిస్తున్నారని సల్మాన్ ఖాన్ ముంబై సివిల్ కోర్టులో గత నెల ఫిర్యాదు చేశాడు. తాజాగా దీనిపై ముంబై సివిల్ కోర్టు జడ్జి విచారించి ‘సెల్మన్ భాయ్’ వీడియో గేమ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు.
వీడియో గేమ్ ప్రమోషన్స్, లాంచింగ్, రీ లాంచింగ్ల్లో సల్మాన్ ఖాన్‌కి సంబంధించిన ఎటువంటి విషయాలు లేకుండా నిషేధించారు. అలాగే ఆ గేమ్‌ని గూగుల్ ప్లే స్టోర్ లాంటి అన్ని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని గేమ్ డెవలపర్స్ పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ‘‘సెల్మన్ భాయ్’ గేమ్ డెవలపర్స్ నా అనుమతి లేకుండానే కమర్షియల్‌గా లబ్ధిపొందారని’ గతనెల సల్మాన్ ఖాన్ ఫైల్ చేసిన కేసులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.