సకాలంలో పంట రుణాలు అందించాలి : మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బీఆర్కే భవన్లో ఎస్ఎల్బీసీ (SLBC) 29 వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో యానివల్ క్రెడిట్ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7,360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులుఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు.
తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కొవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరిన్ని ముద్రా రుణాలను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు.

సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్.బి.ఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వై. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్స్.. ఆర్చరీ రికర్వ్‌లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

