హైదరాబాద్ : మెదక్ జిల్లా(Medak) మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు( Private travel bus) దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలం నుంచి బస్సు డ్రైవర్లు పారిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్లలు