సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 11:10:56

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఉద‌యం 8 గంట‌లకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కాగా, మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు 1926 పోల‌య్యాయి. ఇందులో కొన్ని తిర‌స్క‌రించ‌బ‌డ్డాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో అత్య‌ధికంగా బీజేపీ పోల‌య్యాయి. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మ‌రికాసేప‌ట్లో తొలి రౌండ్ ఫ‌లితం వెల్ల‌డి కానుంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.