Digital Gold | డిజిటల్ గోల్డ్ కొంటారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాదికిగాను ఈ నెల 10 (శుక్రవారం)న వస్తున్నది. ఈరోజున పసిడి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద నగల వ్యాపారులు సైతం కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
- సంప్రదాయ బంగారానికి (నగలు, నాణేలు, కడ్డీలు) ఉన్న దొంగతనం బెడద డిజిటల్ గోల్డ్‌కు ఉండదు.
- చిన్నచిన్న మదుపరులకూ అనువైనది.
- నగదులోకి సులభంగానే మార్చుకోవచ్చు.
- ఎప్పుడైనా ఆన్లైన్లో అమ్ముకోవడానికి, కొనడానికి వీలుంటుంది.
- సురక్షితమైన పెట్టుబడి. ధరల్లో, నాణ్యతలో అత్యంత పారదర్శకత ఉంటుంది.
Digital Gold | బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాదికిగాను ఈ నెల 10 (శుక్రవారం)న వస్తున్నది. ఈరోజున పసిడి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద నగల వ్యాపారులు సైతం కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మార్కెట్లో ఆఫర్లు, గిఫ్ట్‌లు, తగ్గింపులు అంటూ సందడే సందడి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొనుగోలుదారుల ఆలోచనా తీరులోనూ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే భౌతిక బంగారం నుంచి డిజిటల్ గోల్డ్ వైపు కస్టమర్లు అడుగులు వేస్తున్నారు. గత కొన్నేండ్లుగా అక్షయ తృతీయకు ఈ డిజిటల్ గోల్డ్‌ను కొనేవారు క్రమేణా పెరుగుతూ వస్తుండటం కూడా గమనార్హం. బంగారంతో పోల్చితే డిజిటల్ గోల్డ్కున్న అనుకూలతల్ని పరిశీలిస్తే..
డిజిటల్ గోల్డ్ అంటే?
డిజిటల్ గోల్డ్‌కు భౌతిక రూపం అంటూ ఏమీ ఉండదు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా లావాదేవీలు నడుస్తాయి. అయితే సంప్రదాయ మార్కెట్లోని బంగారం ధరలు.. డిజిటల్ గోల్డ్ విలువను ప్రభావితం చేస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) డిజిటల్ గోల్డ్‌గానే పరిగణించవచ్చు.
ఎలా కొనాలి?
ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇన్వెస్టర్లు డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు. మీరు కొన్న డిజిటల్ గోల్డ్‌కు సమాన విలువ కలిగిన భౌతిక బంగారాన్ని తమ సొంత వాల్ట్స్‌లో ఇది నిల్వ చేస్తుంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్‌కు చెందిన బులియన్ బ్రాండ్ పీఏఎంపీ ఎస్ఏ జాయింట్ వెంచరే ఈ ఎంఎంటీసీ-పీఏఎంపీ.
దీని భాగస్వామ్యంతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు, మోతీలాల్ ఓస్వాల్, ఏంజెల్ బ్రోకింగ్ వంటి బ్రోకరేజీ సంస్థలు డిజిటల్ గోల్డ్ క్రయవిక్రయ లావాదేవీల్లో పాల్గొంటున్నాయి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు. కొనుగోలుదారులు ఎప్పుడంటే అప్పుడు వీటిని తిరిగి అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు.
చివరగా..
ప్రభుత్వ నియంత్రణ అంతగా లేకపోవడంతో డిజిటల్ గోల్డ్ క్రయవిక్రయాలు, నిల్వపై ఫీజుల భారాన్ని ఇన్వెస్టర్లు మోయాల్సి వస్తున్నది. పైగా ప్రతీ ఆరు నెలలకోసారి అకౌంట్ యాక్టివిటీ ఉండాల్సిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

