Post office Schemes | పోస్టాఫీస్ స్కీములు భళా.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
రిస్క్ తక్కువ-రాబడి ఎక్కువ ఇది.. పోస్టాఫీస్ పథకాల్లో ఉన్న సౌలభ్యం. మీ భవిష్యత్తు కోసం మీ సంపద వృద్ధి చెందేలా పోస్టాఫీస్ రకరకాల పెట్టుబడి మార్గాలను అందిస్తున్నది. పైగా వీటిలో చాలావరకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుల్నీ ఇస్తున్నాయి.
Post office Schemes | రిస్క్ తక్కువ-రాబడి ఎక్కువ ఇది.. పోస్టాఫీస్ పథకాల్లో ఉన్న సౌలభ్యం. మీ భవిష్యత్తు కోసం మీ సంపద వృద్ధి చెందేలా పోస్టాఫీస్ రకరకాల పెట్టుబడి మార్గాలను అందిస్తున్నది. పైగా వీటిలో చాలావరకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుల్నీ ఇస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 9 రకాల సేవింగ్స్ స్కీములు పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రతీ 3 నెలలకోసారి ఈ స్కీముల వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం
సవరిస్తుంది. ఆయా పథకాలను ఒక్కసారి పరిశీలిస్తే..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్)లో వడ్డీరేటు అత్యధికంగా 8.60 శాతం. 60 ఏండ్లు దాటిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ.1,000. గరిష్ఠం రూ.15 లక్షలు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ ఉంటాయి.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల కోసం ఉద్దేశించిన ఈ సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) స్కీంలో మదుపు చేస్తే 8.40 శాతం వడ్డీరేటును పొందవచ్చు. నెలకు రూ.250 చొప్పున కూడా డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులనూ అందుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో వడ్డీరేటు 7.90 శాతం. ఈ స్కీం కింద ఏటా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలూ అందుతాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం
ఐదేండ్ల కాల పరిమితి కలిగిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) పథకంలో 8వ విడుత నడుస్తున్నది. ఇందులో వడ్డీరేటు 7.70 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠ పరిమితి అంటూ లేదు. ఎంతైనా పెట్టుబడులుగా పెట్టుకోవచ్చు.
టర్మ్ డిపాజిట్ స్కీం
ఇందులో వడ్డీరేటు 6.90 శాతం నుంచి 7.70 శాతం వరకు ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం (పీఎంఐ) పథకంలో వడ్డీరేటు 7.60 శాతం. కనీస పెట్టుబడి రూ.1,500. సింగిల్ అకౌంట్లలో గరిష్ఠ పెట్టుబడికున్న పరిమితి రూ.4.5 లక్షలు. జాయింట్ అకౌంట్లలో రూ.9 లక్షలు.
కిసాన్ వికాస్ పత్ర
పోస్టాఫీస్ అందిస్తున్న అత్యంత పాత పథకాల్లో ఈ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) ఒకటి. ఇందులో వడ్డీరేటు 7.60 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000.
రికరింగ్ డిపాజిట్ స్కీం
ఈ స్కీంలో వడ్డీరేటు 7.20 శాతం. కనీస పెట్టుబడి రూ.100. గరిష్ఠంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
సేవింగ్స్ అకౌంట్
బ్యాంకుల తరహాలో అందుబాటులో ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఇది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాదారులు.. తమ డిపాజిట్లపై 4 శాతం వడ్డీరేటును అందుకోవచ్చు. ఖాతాలో కనీసం రూ.500 ఉంచాల్సిందే. గరిష్ఠంగా ఎంతైనా వేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

