Mamitha Baiju | ‘ప్రేమలు’ సినిమాతో యువతరం అంతా మమిత ప్రేమలో పడిపోయారు. ఇన్‌స్టాలో ఆమె రీల్స్‌కి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా సంచలనంగా మారింది మమిత. ప్రస్తుతం మలయాళంతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నది మమిత. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘నిజానికి నా పేరు నమిత.
మమిత కాదు. నేను పుట్టినప్పుడు హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో నా పేరును మమితగా నమోదు చేశారు. నేను స్కూల్లో చేరేటప్పుడు ఈ పొరపాటు వెలుగుచూసింది. ఇంట్లో అందరూ షాక్. ఇక చేసేది లేక మమితగానే స్కూల్లో జాయిన్ అయ్యాను. మమిత అంటే మిఠాయి అని అర్థం.’ అంటూ చెప్పుకొచ్చింది మమిత. ఇంకా చెబుతూ ‘ప్రేమలు’ నా తొలి సినిమా అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి అది నా పదహారో సినిమా. మలయాళంలో ఇప్పటికే చాలా సినిమాలు చేశాను.’ అని అందంగా నవ్వేసింది మమిత.