సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 14:16:57

ప్రజలు మరో రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు మరో రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం : ప్రజలు మరో రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ సూచించారు. బోనకల్లు మండలంలోని ముష్టికుంట్ల గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దోమల నిర్మూలన పూర్తి స్థాయిలో చేపడితే డెంగీ జ్వరాలు ఉండవని ఆయన సూచించారు .ప్రతి గ్రామపంచాయతీలో వార్డు మెంబర్లు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య సేవలు పొందాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.logo