హైదరాబాద్ : ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పాలన. కుటుంబ పాలనతో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పదవులు లేకున్నా తన సోదరులను రాజకీయ వేదికలు ఎక్కిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు. కాగా, సీఎం రేవంత్‌ను ఆదర్శంగా తీసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) అధికార దుర్వినియోగానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజారామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను బస్టాండ్‌లో(Busstand) నిర్వహించారు.
పాలకుర్తి నియోజక వర్గంలోని రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా కాంగ్రెస్ శ్రేణులు వాహనాలు పార్క్ చేశారు. దీంతో బస్టాండ్‌లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే బస్సులు వెళ్లిపోయాయి.
మండే ఎండలో రోడ్డుపైనే నిలబడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే భర్త బర్త్ డే అయితే మమ్మల్నెందుకు ఇబ్బందులకు గురిచేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడే ఇదే హాట్ టాఫిక్‌గా మారింది.
పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికార దుర్వినియోగం
బస్టాండ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజారామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేసిన… https://t.co/2GMymKnyim pic.twitter.com/6ZdSD0chGS
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | మాట తప్పడం.. మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన: హరీశ్ రావు
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య