జనగామ : హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. జనగామ కలెక్టర్, పార్టీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అత్యంత వెనుక బడిన కులంలో జన్మించిన ఐలమ్మ తన వీరోచిత పోరాటంతో తెలంగాణ బహుజన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజా స్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు.
పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అనేక భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచిందన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటయోధులను గౌరవించు కునే సంస్కృతి, సంప్రదాయం మనదన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష