Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఈ నెల 27న రాష్ట్రప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. బీఏ, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షను వచ్చే నెల 2వ తేదీన, ఎంబీఏ వన్‌టైం చాన్స్ పరీక్షను వచ్చే నెల 3వ తేదీన, మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్‌ఎం) పరీక్షను తిరిగి వచ్చే నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా సమయం, పరీక్షా కేంద్రంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | బీఈ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
Telangana | రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
KTR | అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన కేటీఆర్