Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్లాగ్, సప్లమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన కేటీఆర్
KT Rama Rao: 3D వ్యూహాంలో రేవంత్ రెడ్డి సర్కార్: కేటీఆర్