షాద్‌నగర్, జనవరి 02 : రంగారెడ్డి(Rangareddy) జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లాల్‌పహాడ్ నుంచి చౌదర్‌గూడ మండలం వెళ్తున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య అనే వ్యక్తిపై ఆటో పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!
Vinod Kumar | తెలంగాణ హైకోర్టులో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టాలి : వినోద్ కుమార్
Siricilla | అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో ఆత్మహత్య