భద్రాచలం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో’(Heavy rains) భద్రాచలంలో(Bhadrachalam) గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. నీటి మట్టం 43.1 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వాగులు, చెరువులు వద్దకు ఎవరు సందర్శకులు వెళ్ల కూడదని, మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నది. కాగా, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తు తం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో వరద పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
Also read..