Devara Movie Third Single | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది చిత్రబృందం. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాటలను విడుదల చేయగా.. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘దావుడి’ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
#Daavudi – 𝐓𝐡𝐞 𝐍𝐞𝐱𝐭 𝐁𝐢𝐠 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 🔥🕺🏻
See you all at 5:04 PM ❤️❤️#Devara #DevaraOnSep27th pic.twitter.com/kDC03Mue42
— Devara (@DevaraMovie) September 4, 2024
Also read..