రాజాపేట, జనవరి 08 : గ్రామంలో ఇంటింటికి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం అభినందనీయమని రాజాపేట మండలం పారుపల్లి సర్పంచ్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ అన్నారు. గురువారం పారుపల్లిలో కట్కూరి మల్లారెడ్డి జ్ఞాపకార్థం చక్రిపురం చౌరస్తా శ్రీరామ్ బేకరీ యజమాని విజయ్ కుమార్ రెడ్డి అందించిన వాటర్ క్యాన్లను సర్పంచ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో 350 మందికి వాటర్ క్యాన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దాతను గ్రామ సర్పంచ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరెడ్డి జితేందర్ రెడ్డి, జూకంటి ప్రవీణ్, గౌర బక్కయ్య, కరుణాకర్, సిద్దులు, జానకి రాములు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.