Iran : నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఈ దృశ్యాన్ని వారు వీడియో కూడా తీయగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన పోలీసును మహమౌద్ హగీగట్ గా గుర్తించారు. పోలీసు ఆఫీసర్ ఒక కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. మరో వాహనంలో దుండగులు ఆ కారును వెంబడించారు.
ఒక వ్యక్తి చేతిలో గన్ మెషీన్‌తో వేగంగా వెళ్తున్న కారుపై కాల్పులు జరిపారు. పోలీసు మరింత వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. బుల్లట్లు తగలడంతో పోలీసు మరణించాడు. ఈ క్రమంలో కారు దూరంగా వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనను నిందితులే వీడియో తీయడం గమనార్హం. కొంతకాలంగా ఇరాన్ లో అంతర్యుద్ధం తలెత్తిన సంగతి తెలిసిందే. దేశంలో ఆంక్షలు, ఆర్థిక పరిస్థితి దిగజారడం వంటి కారణాల వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక పోలీసును చంపగా.. తాజాగా రెండో ఘటన జరిగింది. మహమౌద్ హగీగట్ హత్యపై పోలీసులు స్పందించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుని, శిక్షిస్తామని చెప్పారు.
#فوری
ویدئو لحظه ترور محمود حقیقت فرمانده پاسگاه ایرانشهر و فرمانده سابق حفاظت اطلاعات🔴 مزدوران رژیم ببینند چه عاقبتی در انتظار آنهاست اگر دست از حمایت از این رژیم جنایتکار برندارند !#اعتراضات_سراسری pic.twitter.com/jvm2LYsSyj
— 𝘼𝙨𝙝𝙠𝙊𝙛𝙄𝙧𝙖𝙣 (@AshkOfIran) January 7, 2026
ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టెహ్రాన్ లోని చారిత్రక ఓల్డ్ గ్రాండ్ బజార్ ను కూడా కొద్ది రోజులుగా మూసి ఉంచారు. ప్రస్తుతం అక్కడ ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. కరెన్సీ విలువ పడిపోయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ప్రభుత్వ లోపం, నిర్లక్ష్యం వంటి కారణాలతో ఇరాన్లో ఈ పరిస్థితి తలెత్తింది.