మంగళవారం 26 మే 2020
Telangana - May 14, 2020 , 22:31:02

నిర్మల్ పట్టణానికి కొత్త అందాలు:మంత్రి అల్లోల

నిర్మల్ పట్టణానికి కొత్త అందాలు:మంత్రి అల్లోల

నిర్మల్ :  జిల్లా కేంద్రమైన నిర్మల్ పట్టణానికి అందంగా తీర్చిదిద్దేడమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అట,వీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  పట్టణ ప్రగతి లో భాగంగా రూ 10 లక్షల వ్యయంతో  ఎల్ఈడి స్ట్రిప్( రోలింగ్) లైటింగ్ ను చైన్ గేట్ పెట్రోల్ పంప్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్  జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన విధంగా మన నిర్మల్ మున్సిపాలిటీ లో మంచిర్యాల్ చౌరస్తా నుండి బైల్ బజార్ వరకు 220 పో పోల్స్ కు ఏర్పాటు  చేసిన ఎల్ఈడి స్ట్రీప్ ( రోలింగ్) లైటింగ్ అమర్చినట్లు ఆయన తెలిపారు. ఎల్ ఈ డి స్టిప్ లైటింగ్ తో పట్టణానికి కొత్త అందాలు వచ్చాయన్నారు.logo