యాదాద్రి భువనగిరి : గణతంత్రం రోజున భువనగిరి(Bhuvanagiri) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో అంబేద్కర్‌కు, జాతీయ జెండాకు(National flag) అవమానం జరిగింది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటం లేకుండా జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎగరవేశారు. దీంతో అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై బీఆర్ఎస్, బీజేపీ, దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారుల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ఇవి కూడా చదవండి..