అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ (Vikasit Bharat) , స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu) అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం ( Republic day) సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగాలను మరోసారి స్మరించుకుందామని సీఎం అన్నారు.
శాససనభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయ సమైక్యత, సమగ్రత, సోదరభావం అనే మూలాల మీద ఏర్పడిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 76 సంవత్సరాలైనా సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎస్ విజయానంద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
గణతంత్ర దినోత్సవం వేడుకలను భిన్నత్వంలో ఏకత్వంలా ఘనంగా జరుపుకుందామని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ట్విటర్లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసికట్టుగా ఉందామని అన్నారు.