Mass Jathara Manadhe Idantha | మాస్ మహరాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. నేడు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మాస్ జాతర’ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంది ఈ గ్లింప్స్. చాలా రోజుల తర్వాత పాత రవితేజ కనిపించబోతున్నాడని.. రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలుంటాయని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.