TVK Vijay | తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జాతీయ పార్టీలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిరెడీ అవుతున్న విషయం తెలిసిందే. తమిళనాట నటుడు, టీవీకే చీఫ్ విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే మాజీ టీవీకే నేత రంజనా నచియార్ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే. తాను పార్టీలో మార్పులు తీసుకురాబోతున్నానని విజయ్ చెప్పారని.. అయితే విజయ్ తన మాటల మీద నిలబడటం లేదన్నారు.
టీవీకే చీఫ్ విజయ్ ముందుకొచ్చి ప్రజలను కలవాలి. పార్టీలో జరుగుతున్న చాలా అంశాలను అనుమానించాల్సి వస్తోంది. మహిళా దినోత్సవం రోజు టీవీకే నేత మహిళలను స్టేజ్‌పై అగౌరవపరిచారు. విజయ్ క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్, మహిళానేతలు, ప్రజలను కూడా కలవడం లేదు. డీఎంకే ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ, డీఎంకేపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నటి, మాజీ టీవీకే నేత అయిన రంజనా నచియార్ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేలో చేరారు.
#WATCH | Chennai, Tamil Nadu: Former TVK leader Ranjana Nachiyaar says, “TVK is a party which leader Vijay has started. He says that he is going to give a difference in party… but he does not keep up his words. He should come and meet people… I suspect so many things in the… https://t.co/l2DpuvpPGg pic.twitter.com/sR2Ux95dTL
— ANI (@ANI) March 19, 2026