నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండటం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ (Nalkgonda)మున్సిపాలిటీ వర్కర్స్ (Municipal workers)ఉద్యమబాట పట్టారు. మున్సిపాలిటీలో వర్కర్లకు రెండు నెలలకు సంబంధించిన జీతాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా 9 నెలల ఏరియల్స్ ఇవ్వకపోవడంతో నేడు ఆందోళన చేపట్టారు.
సిఐటియు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలిచాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెలల తరబడి సాలరీ అందకపోవడంతో కుటుంబం గడువని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వెంటనే స్పందించి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Also Read..
Mahatma Gandhi | మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
Cosmetic Products: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌లతో జాగ్రత్త.. వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి