TG Rains | హైదరాబాద్ : తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ నెల 8వ తేదీన ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలను వాతావరణ శాఖ విడుదల చేయలేదు.
ఇవి కూడా చదవండి..
Teegala Krishna Reddy | టీడీపీలో చేరనున్న తీగల కృష్ణా రెడ్డి..!
Balka Suman | అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి.. బాల్క సుమన్ తీవ్ర విమర్శలు