RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలపై గూండాయిజం ప్రదర్శిస్తూ, దాడులకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులే కాదు.. అవసరమైతే చంపేందుకు కూడా వెనుకాడమని బహిరంగంగా అధికార పార్టీ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు. ఈ ప్రసంగాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రం బెదిరింపుల తెలంగాణగా మారిందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బెదిరింపుల భాషపై ఆర్ఎస్పీ మండిపడ్డారు. కేటీఆర్ మీద పెట్రోల్ పోసేందుకు 500 మంది కార్యకర్తలు, హరీశ్‌రావు మీద పెట్రోల్ పోసేందుకు మరో 500 మంది కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాడట. ఇక చివరకు తన(మైనంపల్లి) మీద కూడా పెట్రోల్ పోసుకుంటాడట. ఇక ముగ్గురం చావడానికి సిద్ధం.. ఒక వేళ ఆ చాన్స్ లేకపోతే మరి పట్టుకుని చంపేస్తాం కొడుకా.. అని బెదిరింపులకు పాల్పడ్డాడు మైనంపల్లి హన్మంతరావు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన ప్రతి మాట నేరం.. అవును ముమ్మాటికీ తీవ్రమైన నేరమే.. మరి డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. నిజానికి దీని మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పరిశోధన చేయాలి. ఈ అంశంపై సెప్టెంబర్ 3వ తేదీ నాడే గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు పోలీసుల నుంచి స్పందన లేదన్నారు. స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడితే లీగల్ ఓపినీయన్ తీసుకుంటున్నామని చెబుతున్నారు. అసలు పోలీసులకు హెడ్ ఎవరు.. సీపీనా..? పీపీనా..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
ముందు రేవంత్ రెడ్డి, మైనంపల్లిలను ఒప్పించి తూతూమంత్రంగా కేసు చేస్తరా? నాకొక అనుమానం.. ఒక సామాన్య పౌరుడు ఇట్లనే మాట్లాడితే వెంటనే కేసులు బుక్ చేయరా సార్? అని ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ నిలదీశారు. మొన్న హైడ్రా బాధితులు కడుపుకాలి సీఎం రేవంత్ రెడ్డిని నానా శాపనార్థాలు పెడితే లీగల్ ఒపీనియన్ తీసుకొనే కేసులు పెట్టిండ్రా? రాత్రికి రాత్రి టాస్క్ ఫోర్స్ వచ్చి అక్రమంగా వాళ్లను ఎత్తుకొని పోయిండ్రు కదా! కళ్ల ముందే నేరం జరిగినా అన్నింటికీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మరి మనకు ఎందుకు అకాడమీల్లో ట్రైనింగ్, సెక్షన్ 154(1) CrPC కింద విస్తృతమైన అధికారాలు, పోలీసు వాహనాలు, యూనిఫాం? ఇవన్నీ ఎందుకు అని పోలీసు అధికారులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
బంగారు తెలంగాణ నుండి బెదిరింపుల తెలంగాణ వరకు…కాంగ్రేసు పాలన!
ఇక్కడ మైనంపల్లి హన్మంతరావు (కాంగ్రేసు) గారి బెదిరింపుల భాష వినండి..
కేటీఆర్, హరీష్ రావు గార్ల మీద పెట్రోలు పోసి ఈయన మీద కూడా పోయాలంట 😳
పక్కా ప్లాను వేస్తడంట..జైలుకు కూడా పోతడంట…అయ్యా @TelanganaDGP గారూ,
హన్మంతరావు… pic.twitter.com/qwibyQpYbZ— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 7, 2024
ఇవి కూడా చదవండి..
Teegala Krishna Reddy | టీడీపీలో చేరనున్న తీగల కృష్ణా రెడ్డి..!