హైదరాబాద్ : ఫార్ములా-ఈ కారు రేసు(Formula-E car race) కేసులో లాయర్ సమక్షంలో కేటీఆర్‌ను ప్రశ్నలు అడగడానికి ఏసీబీకి ఏం ఇబ్బందని ఎమ్మెల్సీ రవీందర్ రావు(MLC Ravinder Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏసీబీ చెప్పనివి రాసుకుంది. అందుకే లాయర్ సమక్షంలో ప్రశ్నలు అడగమని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, హామీలపై పోరాడే కేటీఆర్‌ను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అనేటోడు రూ.50 లక్షలు లంచం ఇస్తూ దొరికిన దొంగ.. ఇతను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మన కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి పనికిమాలిన సన్నాసి, చేతకాని దద్దమ్మకు కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వేధించినా ప్రజల పక్షాన ఉద్యమించడం ఆపమన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు..!
KTR | కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది : కేటీఆర్
Rythu bharosa | రైతు భరోసా మోసంపై కర్షకుల కన్నెర్ర.. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిరసనలు