KTR | కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు..!
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్ కోరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీలు జారీచేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీమ్‌కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతే ఆఫీస్‌లోకి రావాలన్నారు. అయితే లీగల్ టీమ్ ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది : కేటీఆర్
MLC Kavita | కేటీఆర్‌పై అందుకే అక్రమ కేసులు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
KTR | భారత రాజ్యాంగమా.. రేవంత్ రాజ్యాంగమా?: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

