MLC Kavitha : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓవైపు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్న ఆమె మరోవైపు దేవాలయాలను దర్శిస్తూ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. జూన్ 9 సోమవారం కూడా కవిత పలు కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఇందల్వాయి (Indalwai)లోని శ్రీ సీతారామస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు.
అనంతరం మధ్నాహ్యం 1 గంటలకు కమ్మర్పల్లి పద్మశాలి ఫంక్షన్‌కు ఎమ్మెల్సీ చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకుమార్ వివాహ రిసెప్షన్‌కు హాజరై కొత్త జంటను ఆశీర్వదిస్తారు కవిత. రిసెప్షన్ నుంచి 2 గంటల ప్రాంతంలో నేరుగా జక్రాన్ పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చేరుకుంటారు కవిత. స్థానిక ఎంపీపీ కంచాల రాజు (Kanchala Raju)ను పరామర్శిస్తారు.