హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి (Disqualification) ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula) ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevanreddy) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల స్పందించారు. మీ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభాపతి ప్రసాద్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ప్రజలు, రైతుల కోసం జైలుకు పోవడానికి రెడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మహారాష్ట్రకు వందల కోట్ల నగదు..! కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ : కేటీఆర్
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి