మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 19:30:41

గుడుంబా బాధితుల పున‌రావాస‌ క‌ల్ప‌న‌పై మంత్రి స‌మీక్ష‌

గుడుంబా బాధితుల పున‌రావాస‌ క‌ల్ప‌న‌పై మంత్రి స‌మీక్ష‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని గోషా మ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో గుడుంబా బాధితుల‌కు పున‌రావాస‌ క‌ల్ప‌న‌పై రాష్ర్ట ఆబ్కారిశాఖ మంత్రి వి. శ్రీ‌నివాస్‌గౌడ్ ఆదివారం ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఆబ్కారిశాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుడుంబా నిర్ములనలో భాగంగా లబ్ధిదారులకు పునరావాస పథకంలో భాగంగా దూల్‌పేట‌లో 505 మంది లబ్ధిదారులకు, హైదరాబాద్ జిల్లాలో 795 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల విలువైన యూనిట్ లను మొత్తం రూ. 16 కోట్లు ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు అందించిన‌ట్లు తెలిపారు. పునరావాస పథకంలో భాగంగా నూత‌న లబ్ధిదారులకు ఎన్జీవో,  ప్రభుత్వ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పథకాలను, స్కిల్ డెవలప్ కోర్సుల్లో శిక్షణ  అందివ్వడం వల్ల వారి జీవితాలలో వెలుగులు అందించవచ్చ‌ని అధికారులకు సూచించారు.