రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించారు.

నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత పట్టణంలో మూడు సమస్యలు ఉండేవన్నారు. కడ్తాల్ నుంచి సోఫీ నగర్ వరకు రూ. 4 కోట్లతో డివైడర్, రహదారి మరమ్మతులు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే సరస్వతి కెనాల్ బ్రిడ్జి వెడల్పు చేయనున్నామని తెలిపారు.
గాజుల్ పేట్ చౌరస్తా నుంచి గాజుల్ పేట్, లంగ్డాపూర్, వెంగ్వాపేట్ మీదుగా ఆలూర్ వరకు రహదారి కోసం రూ. 4 కోట్లు మంజూరు చేశామని మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి పనులు ప్రారంభిస్తామని అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు.
ఆలూర్ వరకు డబుల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి లైట్లు పెట్టనున్నామని తెలిపారు. అనంతరం రాంరావ్ బాగ్‌లో జౌళి నాళా పూడికతీత పనులను ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

