Y Sathish Reddy | మంత్రి సీతక్క ఇసుక మాఫియా.. ఆమె కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నారు : బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి
Y Sathish Reddy | యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్‌ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్‌లో కూడా ఓ లింక్ వస్తుందని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఆరోపించారు..
Y Sathish Reddy | ఆవును చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తదా అన్నట్టు ఓ వ్యవహారం ఉంది. మంత్రి సీతక్క ఇసుక మాఫియా నడుపుతుంటే ఆమె కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నాడని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఉన్న యువతను తప్పుదోవ పట్టిస్తూ అక్కడ యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్‌ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్‌లో కూడా ఓ లింక్ వస్తుంది.. మీరూ కూడా చూడండి. ఈ లైవ్‌లోనే సూర్య ఫొటో కూడా ఉంటుంది.
హస్తం గుర్తు.. సూర్య ఫొటోతో ఒక క్రికెట్ మ్యాచ్ లైవ్ వస్తుంది.. ఇదేదో మేం ములుగు ఇతర ప్రాంతాల్లో నుంచి యువతను ప్రోత్సహించడానికి వీల్లేమైనా టోర్నమెంట్ పెట్టారేమో అనుకున్నం. ఇదెక్క్డడ జరుగుతుందంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికైతే పోయి పైలాన్, కలెక్టరేట్ ఓపెనింగ్ చేస్తున్నారో.. అక్కడి 2-3 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న పోలీస్ స్టేడియంలోనే జరుగుతుంది. ఆ పోలీస్ స్టేడియాన్నే లీజుకు తీసుకొని అదే స్టేడియంలో ఒక టోర్నమెంట్ పెట్టుకున్నారు. దాంట్లో 8 టీమ్‌లుంటాయి. పవిత్రమైన దేవుళ్ల మీద పేరు పెట్టుకొని వాళ్లు చేస్తున్న పనేందంటే బెట్టింగ్. ఆ టోర్నమెంట్‌ను ఓపెనింగ్ రోజు లాంచ్ చేసిందెవరంటే అక్కడున్న పోలీస్ అధికారి ములుగు ఎస్పీ.. పోలీస్ స్టేడియంలో పోలీస్ అధికారితోనే ఓపెన్ చేయించి.. ఓపెన్‌గా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎవరైతే బెట్టింగ్ లాంటి వాటిని నియంత్రించాలో వాళ్ల చేతిమీదనే ఓపెన్ చేసి ఈరోజు బెట్టింగ్స్ చేస్తున్నారు. మేమేం ఆరోపణలు చేయడం లేదు.. వీటిని మేం ఆధారాలతో సహా చూపిస్తాం. మల్లూరు వర్సెస్ మేడారం.. ఈ మ్యాచ్‌కు జరుగుతున్న బెట్టింగ్ 1XBళ అనే బెట్టింగ్ ఒకటుంటది. ఆ వెబ్సైట్లో ఓవర్ ఓవర్లో బాల్‌కు బెట్టింగ్ జరుగుతున్నదన్నారు. ఇదేం ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు.. నేషనల్ మ్యాచ్ కాదు.. కనీసం ఐపీఎల్ మ్యాచ్ కాదు.. అలాంటివి కాకుండా వాటిని లైవ్ ఇచ్చి వీటిని బెట్టింగ్ పెడుతున్న యువత ఎట్లా నష్టపోతున్నరు.. వీళ్లు యువతను ఎట్లా కొల్లగొడుతున్నారంటే.. ఈ మ్యాచ్‌లకు పర్యవేక్షణ కానీ, పారదర్శకత కానీ ఉండదు. వీటిల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చాలా సులభవంగా చేయొచ్చున్నారు. పెద్ద ఇంటర్నేషన్ మ్యాచ్‌ల్లో అంత అబ్జర్వేషన్ ఉండగా మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తుంటే.. ఏమీ లేని ఈ మ్యాచ్‌లను ఎంత ఈజీగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయొచ్చన్నారు.
మంత్రి సీతక్క ఇసుక మాఫియా నడుపుతుంటే ఆమె కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నాడు
ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద యువతని తప్పు దోవపట్టిస్తున్న మంత్రి సీతక్క కొడుకు సూర్య
ఆధారాలతో సహా బయటపెట్టిన బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి
ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద పోలీస్ స్టేడియంలోనే ఎస్పీ… pic.twitter.com/lmhUkyRE9q
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2026
Read Also :
National Song | వందేమాతరంపై రాజకీయ వివాదం.. మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్
NRI | దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఏఎస్ఏ
Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్డేట్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

