ముంబై : నాగ్‌పూర్‌లోని ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకుకు వచ్చారు. అదే సమయంలో ఓ దొంగ ముఖానికి మాస్కు వేసుకుని వచ్చి ఉద్యోగుల కళ్లలో కారం చల్లాడు. రూ.4.53 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లాడు.
బ్యాంకు ఉద్యోగులు వెంటనే అలారమ్ మోగించారు. ఆ దొంగను ఉద్యోగులు, పోలీసులు అరగంటలోపే పట్టుకున్నారు. దొంగను భీవాపూర్లోని టటోలికి చెందిన సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్ గా పోలీసులు గుర్తించారు. బీఎస్సీ చదువుకుని నిరుద్యోగిగా ఉన్నాడని.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతోనే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.