తిమ్మాజిపేట, సెప్టెంబర్ 11 : అప్పుల భారంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ తండాకు చెందిన సక్రూ (42)కు రెండెకరాల పొలం ఉన్నది. ఎకరాలో పత్తి, అర ఎకరాలో వరి పంట సాగు చేశాడు.
రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయగా.. నీరు పడలేదు. దీనికితోడు ఇటీవల ఫారంలోని 10 వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అప్పు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం యాసిడ్ తాగి వాంతులు చేసుకోగా.. కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.