RTC Bus | జహీరాబాద్, సెప్టెంబర్ 29 : తన కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆర్టీసీ బస్సును ఆపాలంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. సదరు వ్యక్తి తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన న్యాల్కల్ మండలం చాల్కి చౌరస్తాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నారాయణఖేడ్ నుంచి జహీరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చాల్కి చౌరస్తాలో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడు తన ఇంటి నుంచి కొంతమందిని కారులో తీసుకొచ్చి బస్సు ఎక్కించాడు. ఆ వ్యక్తి “మరికొంతమంది ఉన్నారు, తీసుకొస్తా, బస్సు ఆపండి” అని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పి వెళ్లాడు. అయితే డ్రైవర్ మాత్రం బస్సును ముందుకు కదిలించాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి కారులో ఇబ్రహీంపూర్ వరకు బస్సును వెంబడించి అడ్డగించి డ్రైవర్‌తో గొడవకు దిగాడు. “చెప్పినా ఎందుకు ఆపలేదు ?” అంటూ వాగ్వాదానికి దిగి, చివరకు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
100 నుంచి సమాచారం అందుకున్న హద్నూర్ పోలీసులు వెంటనే స్పందించి బస్సును స్టేషన్‌కు తరలించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడి వేరే బస్సుల్లో వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు సదరు వ్యక్తిని పిలిపించి గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవర్, కండక్టర్ మధ్య రాజీ కుదిర్చి క్షమాపణ చెప్పించడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం బస్సు తిరిగి జహీరాబాద్‌కు బయలుదేరింది.
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!