సంగారెడ్డి : విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజ నిర్మాణం బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Rajanarsimha) అన్నారు. ఆందోలు నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందోలు నియోజక వర్గం ఎడ్యుకేషనల్ హబ్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. త్వరలో డీఎస్సీ ద్వారా 6,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అలాగే ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను(Health cards) అందజేస్తామని చెప్పారు. ఉద్యోగుల డీఏలు విడుదల చేయాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు : హరీశ్‌రావు
Harish Rao | గుడ్డిగా రేవంత్ మాటలను ఫాలో కాకండి.. డీజీపీకి హరీశ్‌రావు సూచన